ఆవిష్కరణల్లో తెలంగాణ టాప్‌.. కేటీఆర్ ట్వీట్ వైరల్‌..!

ఆవిష్కరణల వృద్ధిలో తెలంగాణ టాప్‌లో నిలవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు.

Advertisement
Update:2024-01-31 11:19 IST

తెలంగాణ మరో అరుదైన ఘనత సాధించింది. ఆవిష్కరణల వృద్ధిలో 4 శాతం పెరుగుదలతో దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్‌లో నిలిచింది. 3i- ఇండియా, ఇంక్యూబేటింగ్‌, ఇన్నోవేషన్ పేరుతో ఎకోవ్రాప్‌ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. గత దశాబ్ధ కాలంగా ఆవిష్కరణల్లో గుజరాత్ తన వాటాను కొనసాగిస్తున్నప్పటికీ.. తెలంగాణ, రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా మేధోసంపత్తిలో అగ్రగామిగా ఎదుగుతున్నాయని స్పష్టం చేసింది.

ఎకోవ్రాప్ నివేదిక ప్రకారం.. తెలంగాణ 2004-13 మధ్య కాలంలో ఆవిష్కరణల్లో కేవలం 0.1 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంది. కానీ, 2014-23 మధ్య ఏకంగా 4 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక గత రెండు దశాబ్ధాల కాలంలో రాజస్థాన్‌ 1.2 శాతం నుంచి 2.3 శాతానికి పెంచుకుని తెలంగాణ తర్వాతి స్థానంలో నిలిచింది.


ఆవిష్కరణల వృద్ధిలో తెలంగాణ టాప్‌లో నిలవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఇక బీఆర్ఎస్ సైతం తన అధికారిక ట్విట్టర్‌లో ఇదే అంశంపై ట్వీట్ చేసింది. ప్రగతిశీల విధానాలు, బలమైన నాయకత్వం 2014-23 మధ్య ఆవిష్కరణలకు ఒక మంచి వాతావరణం ఏర్పడిందంటూ ట్వీట్ చేసింది.

Tags:    
Advertisement

Similar News