కార్పొరేట్‌కు ధీటుగా నిమ్స్ నూతన భవనం!
కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఇప్పటికే తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) పేరుతో రూ.2,100 కోట్ల వ్యయంతో భారీ ఆసుపత్రుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు నిమ్స్‌కి అనుబంధంగా రూ.1,571 కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది అంతస్తుల్లో మూడు బ్లాక్‌లు నిర్మించేందుకు సంకల్పించింది.
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నడంకట్టింది. నిమ్స్ ఆసుపత్రికి అనుబంధంగా నూతన భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం నిమ్స్ 22 ఎకరాల విస్తీర్ణంలో 1,300 పడకలతో ఆసుపత్రిగా అందుబాటులో ఉంది. 2,100 పడకల ఆసుపత్రిగా నూతన భవనాన్ని నిర్మించనున్నారు. దేశంలో ఎయిమ్స్ సహా మరే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ లేనంత భారీ భవనాన్ని నిమ్స్‌లో నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
దేశంలోనే వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణను నంబర్ వన్ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఇప్పటికే తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) పేరుతో రూ.2,100 కోట్ల వ్యయంతో భారీ ఆసుపత్రుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు నిమ్స్‌కి అనుబంధంగా రూ.1,571 కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది అంతస్తుల్లో మూడు బ్లాక్‌లు నిర్మించేందుకు సంకల్పించింది.
ప్రస్తుతం 22 ఎకరాల్లో ఉన్న నిమ్స్ ఆసుపత్రి పక్కనే మరో 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిమ్స్ నూతన భవనం నిర్మించనున్నారు. మూడు బ్లాక్‌ల్లో ఎనిమిది అంతస్తుల్లో నిర్మాణం కానుంది. ఒక బ్లాక్ ఔట్ పేషెంట్, రెండవ బ్లాక్ ఇన్ పేషెంట్, మరో బ్లాక్‌ను ఎమర్జెన్సీ విభాగానికి కేటాయించనున్నారు. మూడు ఎకరాల స్థలంలో పార్కింగ్, గార్డెన్ ఏర్పాట్లు చేస్తున్నారు.
నిమ్స్ నూతన భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 14 వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్స్ విస్తరణ పనులను ప్రారంభించనున్నారు. భవన నిర్మాణం 36 నెలల్లోనే పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.