తెలంగాణ టెట్ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో టెట్ నోటిఫికెషన్ విడుదలైంది. నవంబరు 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ సమర్పించేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించారు.

Advertisement
Update:2024-11-04 14:13 IST

తెలంగాణలో టెట్ నోటిఫికెషన్ రిలీజ్ అయింది. నవంబర్ 5నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం రేపటి నుంచి https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు. కాగా, ఈ ఏడాది మే 20వ తేదీ నుంచి జూన్‌ 2వ వరకు ఆన్‌లైన్‌లో టెట్‌ పరీక్షలు నిర్వహించి ఇప్పటికే ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ ఏడాది ఇది రెండో నోటిఫికేషన్‌ కావడం గమనార్హం.టెట్‌ పేపర్‌-1కు డీఈడీ, పేపర్‌-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్‌ అర్హత ఉండాలని చెబుతుండటంతో వేల మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. టెట్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు తొమ్మిది సార్లు పరీక్షలు నిర్వహించగా.. జనవరిలో పదోసారి జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలుపుకొని ఆరుసార్లు పరీక్షలు జరిపారు.

Tags:    
Advertisement

Similar News