సంప్రదాయాలకు నిలువెత్తు రూపం తెలంగాణ తల్లి విగ్రహం : సీఎం రేవంత్

తెలంగాణ తల్లి అంటే భావన కాదు భావోద్వేగమని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Advertisement
Update:2024-12-09 12:15 IST

చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్క పోరాట స్పూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన సభలో సీఎం ప్రకటించారు. ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు ఆ జాతి అస్తిత్వమని తెలిపారు. ఆ అస్తిత్వానికి మూలం మన సంస్కృతేనని అందుకు ప్రతిరూపం తెలంగాణ తల్లి అని అన్నారు. ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంలో సకల జనులను ఐక్యం చేసింది ఆ ప్రతిరూపమేనని తెలిపారు.

తెలంగాణ జాతి భావనకు జీవం పోసింది తెలంగాణ తల్లి అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రాహాలకు అధికారిక గుర్తింపు లేదని.. తెలంగాణ తల్లి అంటే భావన కాదు.. భావోద్వేగమని సీఎం అన్నారు. కుడి చేతిలో వరి, జొన్న, సజ్జ పంటలతో విగ్రహాన్ని తయారు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విగ్రహం రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు రూపమని తెలిపారు. ప్రతి డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News