ఫైనల్ ఓటర్‌ లిస్ట్ రిలీజ్ చేసిన ఈసీ

అత్యధికంగా హైదరాబాద్‌లో 45 లక్షల 36 వేల 852 మంది ఓటర్లు ఉండగా.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 7 లక్షల 32 వేల 560 మంది ఓటర్లు ఉన్నారు.

Advertisement
Update:2023-11-16 08:01 IST

రాష్ట్రంలో ఓటర్ల ఫైనల్ లిస్ట్‌ విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. తెలంగాణలో మొత్తం 3 కోట్ల 26 లక్షల 2 వేల 799 మంది ఓటర్లు ఉన్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. మొత్తం ఓటర్లలో కోటి 63లక్షల 13వేల 268 మంది పురుషులు, కోటి 63లక్షల 17వందల 5 మంది మహిళలు ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ కు సంబంధించి 2,676 ఓట్లు ఉన్నాయి.

అత్యధికంగా హైదరాబాద్‌లో 45 లక్షల 36 వేల 852 మంది ఓటర్లు ఉండగా.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 7 లక్షల 32 వేల 560 మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా భద్రాచలంలో లక్షా 48 వేల 713 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది.

ఇక రాష్ట్రంలో 18-19 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లు 9 లక్షల 99 వేల 667 మంది ఉండగా.. వీరిలో యువకులు 5లక్షల 70వేల 2744 మంది, అమ్మాయిలు 4 లక్షల 29వేల 273మంది ఉన్నారు. ఇక 120 మంది యువ థర్డ్ జెండర్లకు ఓటు హక్కు వచ్చింది. రాష్ట్రంలో 80 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 4 లక్షల 40 వేల 371గా ఉంది. రాష్ట్రంలో 2,949మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News