తెలంగాణలో విద్యార్థుల అవస్థలు.. 24మందికి ఫుడ్ పాయిజన్

హాస్టల్స్ మాత్రమే కాదు, ఎలిమెంటరీ, హైస్కూల్స్ లో మధ్యాహ్న భోజనం నాణ్యత కూడా సరిగా లేదని తెలుస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ.

Advertisement
Update:2024-08-13 08:36 IST

తెలంగాణ హాస్టళ్లలో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హాస్టల్ ఆవరణలో పాముకాటుకి గురై చనిపోయిన విద్యార్థి కుటుంబాన్ని నిన్న కేటీఆర్ పరామర్శించారు. హాస్టళ్లలో ఉన్న అధ్వాన్న పరిస్థితులను ఆయన మరోసారి ప్రస్తావించారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన సమయంలోనే మరో ఘటన జరగడం విశేషం. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేటలోని జడ్పీ హైస్కూల్ లో మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్లు తిని 24 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

హాస్టల్స్ మాత్రమే కాదు, ఎలిమెంటరీ, హైస్కూల్స్ లో మధ్యాహ్న భోజనం నాణ్యత కూడా సరిగా లేదని తెలుస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. మధ్యాహ్న భోజనంలో పెట్టి కోడిగుడ్లు పాడైపోవడం వల్ల 24మంది విద్యార్థులకు వాంతులయ్యాయి. వెంటనే వారిని నారయణ ఖేడ్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో బెడ్స్ సరిపోక ఒక్కో బెడ్ పై ముగ్గురేసి విద్యార్థులకు చికిత్స అందించారు. వారిని చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.


తెలంగాణలో విద్యాశాఖ, హోం శాఖకు మంత్రులు లేకపోవడం వల్ల.. పనులు సరిగా జరగడంలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ గతంలో కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యంగా విద్యాశాఖలో పర్యవేక్షణ లోపం ప్రముఖంగా ఉందని ప్రస్తావించింది. అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ కాలేదు. విద్యాశాఖను ఎవరికీ కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల వరుసగా హాస్టళ్లలో వివిధ సంఘటనలు జరిగాయి. కొన్ని హాస్టళ్లలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, మరికొన్ని చోట్ల ఫుడ్ పాయిజన్ అయి కొంతమంది చనిపోయారు. పాముకాటు ఘటనలు కూడా ఇద్దర్ని బలి తీసుకున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 8 నెలల్లో 36మంది హాస్టల్ పిల్లలు చనిపోయినట్టు బీఆర్ఎస్ చెబుతోంది. 

Tags:    
Advertisement

Similar News