అంతా గప్ చుప్.. రియల్ ఎస్టేట్ రంగంపై తనిఖీల ప్రభావం

కేవలం నగదు తరలింపుపైనే కాదు, ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ల విషయంలో కూడా ఎన్నికల సంఘం నిఘా పెట్టింది, బ్యాంకర్లను అలర్ట్ చేసింది. పెద్ద మొత్తంలో ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కి నగదు ట్రాన్స్ ఫర్ అయితే కచ్చితంగా లెక్కలు అడిగే అవకాశముంది.

Advertisement
Update:2023-10-30 09:14 IST

తెలంగాణ ఎన్నికల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడింది. ఎన్నికల సందర్భంగా తనిఖీలు ముమ్మరం కావడంతో నగదు రవాణా పూర్తిగా తగ్గిపోయింది. అన్ని ఆధారాలు ఉన్నా కూడా కాస్త పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేందుకు సాధారణ పౌరులు కూడా జంకుతున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దుగా మారింది. ఎన్నికల తర్వాత చూస్కుందాంలే అనే ధోరణిలోకి వచ్చేశారు కొనుగోలుదారులు.

కేవలం నగదు తరలింపుపైనే కాదు, ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ల విషయంలో కూడా ఎన్నికల సంఘం నిఘా పెట్టింది, బ్యాంకర్లను అలర్ట్ చేసింది. పెద్ద మొత్తంలో ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కి నగదు ట్రాన్స్ ఫర్ అయితే కచ్చితంగా లెక్కలు అడిగే అవకాశముంది. దీంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి లావాదేవీలు తగ్గిపోయాయి. నగదు తీసుకెళ్లడానికే కాదు, ఆన్ లైన్ లో బదిలీ చేయడానికి కూడా చాలామంది వెనకాడే పరిస్థితి. ప్లాట్లు కొనేవాళ్లు, అపార్ట్ మెంట్లు కొనేవాళ్లు కొన్నిరోజులు వేచి చూద్దామనుకుంటున్నారు. ఎన్నికల తర్వాత నిబంధనలు సడలిస్తే అప్పుడు తమ లావాదేవీలు మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్నారు.

ఎన్నికలయ్యే వరకు..

మరోవైపు ఎన్నికల సమయంలో రియల్టర్లు రాజకీయ పార్టీలకు, నాయకులకు నిధులు సమకూర్చడం సహజమే. కొంతమందికి నేరుగా రాజకీయాలతో సంబంధం ఉంది. ఇలాంటి వారంతా కొంతకాలం బిజినెస్ ని పక్కనపెడుతున్నారు. సామాన్యులు మాత్రం నగదు లావాదేవీలకు భయపడి గృహప్రవేశాలను కూడా వాయిదా వేసుకుంటున్నారని తెలుస్తోంది. చిన్న చిన్న పనులున్నా కూడా ఎన్నికల తర్వాతే అని వాయిదా వేస్తున్నారు. గృహ నిర్మాణ పనుల్లో కూడా స్తబ్దత నెలకొన్నట్టు తెలుస్తోంది. నెలరోజుల్లో ఎన్నికల హడావిడి ముగిశాక.. అన్నీ వేగం పుంజుకుంటాయని తెలుస్తోంది. 

Tags:    
Advertisement

Similar News