మహిళల భద్రతకోసం కొత్త నెంబర్లు.. ఇవి గుర్తు పెట్టుకోండి

తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రత విభాగం కొత్త ఫోన్‌ నెంబర్లను అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు మహిళా భద్రత విభాగం ట్విట్టర్‌ ద్వారా నూతన నెంబర్లను వెల్లడించింది.

Advertisement
Update:2023-09-09 10:46 IST

తెలంగాణలో విద్యార్థినులు, మహిళల భద్రతకోసం ప్రభుత్వం ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేపట్టింది. షి-టీమ్స్ ద్వారా ఈవ్ టీజింగ్ ని అరికట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం చాలా వరకు సక్సెస్ అయింది. ఇప్పుడు కొత్తగా మరో రెండు నెెంబర్లను అందుబాటులోకి తెచ్చారు. వీటిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని, ఫోన్ లో ఫీడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీస్ అధికారులు.

తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రత విభాగం కొత్త ఫోన్‌ నెంబర్లను అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు మహిళా భద్రత విభాగం ట్విట్టర్‌ ద్వారా నూతన నెంబర్లను వెల్లడించింది.

ఫోన్ ద్వారా 8712656858

వాట్సప్ ద్వారా 8712656856


ఏ రకమైన వేధింపులు ఉన్నా మహిళలు, విద్యార్థినులు 8712656858 నెంబర్‌ కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. వాట్సప్ ద్వారా మెసేజ్ చేయాలనుకునేవారు 8712656856 నెంబర్‌ ను సంప్రదించాలని కోరారు. పేపర్ పై రాసిన ఫిర్యాదుని ఫొటో తీసి అయినా, లేదా మెసేజ్ టైప్ చేసి అయినా వాట్సప్ చేయొచ్చని చెప్పారు. ఈవ్ టీజింగ్ లేదా వేధింపులకు సంబంధించిన ఆధారాలు ఉంటే వాట్సప్ ద్వారా ఫొటోలు, వీడియోలు పంపించ వచ్చని కూడా సూచించారు.

ఎప్పటికీ 100

ఒకవేళ ఆ రెండు నెంబర్లు గుర్తు లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో మాత్రం 100కి ఫోన్ చేయాలని సూచించారు పోలీస్ అధికారులు. 

Tags:    
Advertisement

Similar News