త్వరలో తెలంగాణకు కొత్త సీఎం : మహేశ్వర్ రెడ్డి
త్వరలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి వస్తాడని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ బీజేపీ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి వస్తాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడు నెలల నుంచి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. కేరళ వెళ్లినా కూడా ముఖ్యమంత్రికి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. అక్కడ దూరం నుంచి చూసి వచ్చాడు తప్పా కలువలేదని మహేశ్వర్ రెడ్డి అన్నారు.
జూన్ నుంచి డిసెంబర్ లోపు తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి వస్తాడని తెలిపారు. మూసీ ప్రాజెక్టు వ్యయంను మూడు రెట్లు పెంచిన తరువాత అవినీతి ఉందని బైట పడింది.. అందుకోసమే ప్రక్షాళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణిని సీనియర్ మంత్రులు ఒప్పుకోవడం లేదన్నారు. నేను రీసెర్చ్ చేస్తేనే మాట్లాడుతానని ఏలేటి తెలిపారు. ప్రస్తుతం మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.