బీజేపీకి బుద్ధి రాలేదు.. కాంగ్రెస్‌ను కుమ్ములాటలు వీడలేదు.. - కర్నాటక పరిణామాలపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ ఎద్దేవా
కర్నాటకలో ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులైందని, మెజారిటీ స్థానాల్లో విజయం సాధించినా.. ఆ పార్టీ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసుకోలేకపోతోందని గుత్తా ఎద్దేవా చేశారు.
కర్నాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు.. తదనంతర జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఇటీవల కర్నాటకలో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాతైనా బీజేపీకి బుద్ధి రాలేదని సుఖేందర్ రెడ్డి విమర్శించారు. దేశంలో మతకల్లోలాలు సృష్టించి అధికారంలోకి రావాలని ఆ పార్టీ చూస్తోందని ఆయన ఆరోపించారు.
మరోపక్క కర్నాటకలో ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులైందని, మెజారిటీ స్థానాల్లో విజయం సాధించినా.. ఆ పార్టీ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసుకోలేకపోతోందని గుత్తా ఎద్దేవా చేశారు. ఈ ఎపిసోడ్‌తో ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటల వ్యవహారం దేశమంతా మరోసారి వెల్లడైందని విమర్శించారు.
రాజస్థాన్ కాంగ్రెస్‌లోనూ సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారని గుత్తా తెలిపారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 100 స్థానాల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు. వామపక్షాల మద్దతు లేకుండానే రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.