ప్రారంభమైన తెలంగాణ శాసనసభ సమావేశాలు
బీఏసీ నిర్ణయాలను సభలో ప్రవేశపెట్టనున్న సీఎం
తెలంగాణ అసెంబ్లీ ఉభయసభలో మంగళవారం మూడో రోజు కొనసాగనున్నాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో సభలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు రెండు సభల్లో సమాధానం ఇవ్వనున్నారు. అనంతరం సీఎం బీఏసీ నిర్ణయాలను సభలో ప్రవేశపెడుతారు. అనంతరం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏడో వార్షిక నివేదిక ప్రవేశపెడుతారు. శాసనసభలో స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, వర్సిటీల సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు 2024ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెడుతారు.ఆ తరువాత ఉభయ సభల్లో సోమవారం జరగాల్సిన పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ ఇవాళ జరగనుందని లెజిస్లేచర్‌ఆ తర్వాత ఉభయ సభల్లో సోమవారం జరగాల్సిన పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ ఇవాళ జరనున్నదని లెజిస్లేచర్ కార్యదర్శి నర్సింహా చార్యులు తెలిపారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలంపై చర్చించాలని బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నది.