ఉద్యోగ నైపుణ్యాలున్న యువతలో తెలంగాణ టాప్‌ - ISR రిపోర్టు

యువతలో ఉద్యోగ నైపుణ్యాలకు సంబంధించి వీబాక్స్ సంస్థ గత 11 సంవత్సరాలుగా వీ-బాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల 88 వేల ఉంది ఈ ఎగ్జామ్‌లో పాల్గొన్నారు.

Advertisement
Update:2023-12-27 11:47 IST

దేశంలోనే యంగెస్ట్ స్టేట్‌ తెలంగాణ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఉద్యోగ నైపుణ్యాలు అత్యధికంగా ఉన్న 18-21 ఏళ్ల యువత విషయంలో దేశంలోనే తెలంగాణ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. ఆ వయసులోని 85.45 శాతం యువత ఉద్యోగాలు చేయడానికి అర్హులుగా ఉన్నారని ISR-2024 రిపోర్టు స్పష్టంచేసింది. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్ ఇండస్ట్రీ, టాలెంట్‌ అసెస్‌మెంట్‌ ప్లేయర్‌ వీబాక్స్‌, డిజిటల్ రిక్రూట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌-TAGGD సంయుక్తంగా ఇండియా స్కిల్స్ రిపోర్టు -2024 రిలీజ్ చేశాయి. కేరళ - 74.93 శాతం, మహారాష్ట్ర -74.80 శాతంతో వరుసగా తెలంగాణ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక నగరాల్లో చూస్తే పుణే 80.82 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ 51.50శాతంతో ఏడో స్థానం దక్కించుకుంది.

యువతలో ఉద్యోగ నైపుణ్యాలకు సంబంధించి వీబాక్స్ సంస్థ గత 11 సంవత్సరాలుగా వీ-బాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల 88 వేల ఉంది ఈ ఎగ్జామ్‌లో పాల్గొన్నారు. ఇక ఇదే సర్వే విదేశీ పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్‌ ప్రైమ్ డెస్టినేషన్‌గా నిలిచిందని పేర్కొంది.

న్యూమరికల్ స్కిల్స్ ఉన్న యువత తెలంగాణలో అత్యధికంగా ఉంది. ఈ జాబితాలో 78.68 శాతంతో తెలంగాణ టాప్‌లో నిలిచింది. 37.7 శాతంతో క్రిటికల్‌ థింకింగ్‌ ఉన్న యువత విషయంలోనూ తెలంగాణ టాప్‌లో నిలిచింది. ఇంగ్లీష్ నైపుణ్యం, కంప్యూటర్ స్కిల్స్ విషయంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. 

Tags:    
Advertisement

Similar News