వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటనపై ఉద్యోగ జేఏసీ ఆగ్రహం

వికారాబాద్ జిల్లాలో కలెక్టర్, అధికారులపై గ్రామస్థులు దాడి చేయడాన్నిజరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి తెలిపారు.

Advertisement
Update:2024-11-11 17:52 IST

వికారాబాద్ జిల్లాలో కలెక్టర్, అధికారులపై గ్రామస్థులు దాడి చేయడాన్నిజరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి తెలిపారు. అధికారులపై దాడికి ఉసిగొల్పిన, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని తెలంగాణ డీజీపీ దృష్టికి తీసుకెళ్లి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరుగకుండా చర్యలు చేపట్టాలని కోరనున్నట్లుగా తెలిపారు.

మరోవైపు రెవెన్యూ అధికారులపై జరిగిన దాడికి నిరసనగా వికారాబాద్ జిల్లా రెవెన్యూ ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రక్రియలో భాగంగా గ్రామసభలో ప్రజాభిప్రాయానికి సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్,అదనపు కలక్టర్, కడా ప్రత్యేక అధికారి, కొండగల్ తహశీల్దార్, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది వచ్చారన్నారు. ఈ సమయంలోనే కొందరు అధికారులపై దాడులు చేశారన్నారు. రేపటి నుంచి పెన్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు.. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేసిన అధికారులు

Tags:    
Advertisement

Similar News