హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ కోర్టులో హాజరవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది

Advertisement
Update:2024-09-27 19:54 IST

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. దీనిపై వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు సమాధానం చెప్పాలని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే సోమవారం ఉదయం 10.30 గంటలకు కోర్టులో హాజరవ్వాలని నోటీసులులో పేర్కొన్నాది.

కాగా, అమీన్‌పూర్‌లో ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా కూల్చేసిన విషయం తెలిసిందే. పెద్దచెరువు కబ్జా చేసి ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఇళ్లు కట్టారని హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో,​ చెరువు పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీనికి సంబంధించి కేసు కోర్టు పరిధిలో ఉందని చెప్పిన హైడ్రా పట్టించుకోకుండా కూల్చివేసిందని బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 

Tags:    
Advertisement

Similar News