వేణుస్వామికి తెలంగాణ హైకోర్టు భారీ షాక్

వారంలోగా వేణుస్వామి తెలంగాణ మహిళ కమిషన్‌ ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.

Advertisement
Update:2024-10-28 15:25 IST

ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామికి తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వన్ వీక్ లోపు యాక్షన్ తీసుకోవాలని ఉమెన్ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. హీరో నాగచైతన్య, శోభితా ఎంగేజ్మెంట్ సమయంలో వారు విడిపోతారని వేణు స్వామి జ్యోతిష్యం చెప్పడంతో కాంట్రవర్సీకి దారితీసింది. వేణుపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు మేరకు తమ ముందు హాజరు కావాలని గతంలో వేణు స్వామిని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. అయితే కమిషన్ కు ఆ అధికారం లేదంటూ వేణు స్వామి స్టే తెచ్చుకున్నారు. సోమవారం ఆ స్టే ఎత్తివేస్తూ మహిళా కమిషన్ కు పూర్తి అధికారాలు ఉన్నాయని పేర్కొన్న హైకోర్టు స్పష్టం చేసింది. వారం రోజుల్లో వేణుపై తదుపరి చర్యలు తీసుకోవాలని కమిషన్ ను హైకోర్టు ఆదేశించింది.

తను గతంలో చెప్పినట్లు సమంత, నాగ చైతన్య విడిపోయినట్లుగానే.. శోభిత దూలిపాళ్ల, నాగచైతన్య కూడా విడిపోతారంటూ వేణు స్వామి సోషల్ మీడియాలో ద్వారా తెలిపాడు. గ్రహబలం, పేరుబలం, జాతక బలం అని రకరకాల కారణాలు చెప్పుకొచ్చారు. అయితే వేణు స్వామి కామెంట్స్‌పై సినీ ఇండస్ట్రీలోని పలువురు, జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళా కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. కోర్టులోనూ కేసు వేశారు. ఏపీ ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని జాతకం చెప్పారు. అలాగే టీడీపీకి పూర్వవైభవం లేదని కూడా పలు ఇంటర్వ్యూలలో కామెంట్స్ కూడా చేశారు. అయితే వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం ఆంధ్ర ఎన్నికల్లో తిరగబెట్టడంతో ఆయన మరిన్ని విమర్శల పాలయ్యారు.

Tags:    
Advertisement

Similar News