నోటీసులు రద్దు చేయాలంటూ హైకోర్టుకు బీఎల్ సంతోష్

41ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద తనకు సిట్ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నాయకుడు బీఎల్ సంతోష్ ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారు.తనపై రాష్ట్ర ప్ర‌భుత్వం దురుద్దేశ పూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించిన సంతోష్ అసలు ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధంలేదని కోర్టుకు తెలిపారు.

Advertisement
Update:2022-11-25 16:24 IST

టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర చేసిన కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ సంతోష్ హాజరుకాకపోవడంతో హైకోర్టు సూచన మేరకు ఆయనను ఈ నెల 26న లేదా 28న తమ ముందు హాజరు కావాలని సిట్ మరో సారి నోటీసులు జారీ చేసింది. అంతే కాక ఎమ్మెల్యేల‌ కొనుగోలు ప్రయత్నంకేసులో ఆయనను ఏ4 నిందితునిగా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు హైకోర్టును ఆశ్ర‌యించారు.

తనపై రాష్ట్ర ప్ర‌భుత్వం దురుద్దేశ పూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించిన సంతోష్ అసలు ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధంలేదని కోర్టుకు తెలిపారు. 41ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద తనకు సిట్ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని బీఎల్ సంతోష్ హైకోర్టును కోరారు. ఈ విషయంపై హైకోర్టులో మరి కొద్ది సేపట్లో విచారణ ప్రారంభం కానుంది.

Tags:    
Advertisement

Similar News