తెలంగాణ హైకోర్టులో ఒక్క ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తి లేరు
శామీర్‌పేటకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మించాలి : మాజీ ఎంపీ వినోద్ కుమార్
Advertisement
తెలంగాణ హైకోర్టులో ఒక్క ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తి లేరని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్య 42కు పెంచినా 23 మందికి మించి భర్తీ చేయడం లేదన్నారు. జడ్జీల పోస్టులన్నీ భర్తీ చేస్తే దళిత, గిరిజన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. పూర్తి స్థాయిలో న్యాయమూర్తులు లేకపోవడంతో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. సీజే వెంటనే జోక్యం చేసుకొని పూర్తి స్థాయిలో జడ్జీల నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. శామీర్‌పేటకు మెట్రో రైల్ ఒక్కటే వేస్తే ట్రాఫిక్ కష్టాలు తీరవని అన్నారు. నాగ్‌పూర్ తరహాలో జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ వేస్తేనే ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని అన్నారు.
Advertisement