గ్రూప్-1 ఫలితాల విడుదలకు తెలంగాణ హైకోర్టు అనుమతి

అభ్యర్థి లోకల్ స్టేటస్ ను పరిగణనలోకి తీసుకోవాలని కమిషన్‌ను కోరుతూ సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ TSPSC దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ పి కార్తీక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఒక‌ అభ్యర్థి అభ్యర్థన కారణంగా మొత్తం గ్రూప్-1 ఫలితాలను నిలిపివేయడం సరికాదని కోర్టు పేర్కొంది.

Advertisement
Update:2023-01-12 07:57 IST

ఒక అభ్యర్థి లోకల్ స్టేటస్ పై వివాదానికి సంబంధించి నిలిపివేసిన‌ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)కు తెలంగాణ హైకోర్టు బుధవారం అనుమతినిచ్చింది. ఒక అభ్యర్థి స్థానిక స్థితిపై ఉన్న వివాదం కోసం అభ్యర్థులందరి ఫలితాలను నిలిపివేయడం సరైంది కాదని, ఆ అభ్యర్థి కేసును తర్వాత పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది.

అభ్యర్థి లోకల్ స్టేటస్ ను పరిగణనలోకి తీసుకోవాలని కమిషన్‌ను కోరుతూ సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ TSPSC దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ పి కార్తీక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఒక‌ అభ్యర్థి అభ్యర్థన కారణంగా మొత్తం గ్రూప్-1 ఫలితాలను నిలిపివేయడం సరికాదని కోర్టు పేర్కొంది.

ఏడవ‌ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు తెలంగాణలో చదివిన తనకు లోకల్ కోటా వర్తింపజేయలేదని గ్రూప్-1 అభ్యర్థి పీ నిహారిక హైకోర్టులో సవాల్ చేసింది. ఆమె అప్పీల్‌ను విచారించిన సింగిల్ జడ్జి బెంచ్ ఆమె స్థానిక స్థితిని పరిగణనలోకి తీసుకోవాలని TSPSCని ఆదేశించింది.

తెలంగాణలో ఒకటవ‌ తరగతి నుంచి ఏడవ‌ తరగతి వరకు చదివితేనే లోకల్ స్టేటస్ వర్తిస్తుందని కానీ నిహారిక ఆరో తరగతి వరకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో చదివారని అందువల్ల‌ ఆమెకు స్థానిక కోటా వర్తించదని టీఎస్‌పీఎస్సీ తరఫున ఎం. రాంగోపాల్‌రావు వాదించారు.

సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాల కారణంగా లక్షలాది మంది గ్రూప్ అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాలను విడుదల చేయాలని TSPSCని డిమాండ్ చేస్తున్నారు. సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలను అమలు చేయాలని నిహారిక తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. వాదనలు విన్న డివిజన్ బెంచ్ అభ్యర్థికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని టీఎస్ పీఎస్సీని ఆదేశించింది. ఆమె స్థానిక స్థితిపై తుది ఉత్తర్వులు తర్వాత జారీ చేస్తామని కూడా పేర్కొంది. 

Tags:    
Advertisement

Similar News