రూ.500 సిలిండర్‌ కోసం 3 కండీషన్లు

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రూ.500కే పేదలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రూ.500కే సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు వీలుగా మార్గదర్శకాలతో ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.

Advertisement
Update:2024-02-27 16:56 IST

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో గ్యారంటీని రేవంత్ సర్కారు అమలు చేసింది. ఆరు గ్యారంటీల్లో భాగమైన మహాలక్ష్మి పథకంలోని రూ.500కే గ్యాస్ సిలెండర్ హామీని అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం అమలుకు అర్హత, షరతులు ఇతర వివరాలతో తాజాగా జీవో రిలీజ్ చేసింది.

3 కండీషన్లు ఇవే..

1. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఉండాలి

2. తెల్ల రేషన్ కార్డు ఉండాలి

3. లబ్ధిదారుని పేరు మీదే గ్యాస్ కనెక్షన్ ఉండాలి

సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 39.5 లక్షల లబ్ధిదారులను గుర్తించారు. పథకానికి అర్హులుగా తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 3 సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని.. దాని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్స్ కేటాయిస్తారు. వినియోగదారులు మొదట మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకోవాలి. ఆ తరువాత వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ జమ చేస్తారు. గ్యాస్ సబ్సిడీని ప్రభుత్వం నేరుగా OMC సంస్థలకు ఇస్తుంది. సంస్థల నుంచి DBT ద్వారా వినియోగదారులకు నగదు చెల్లింపు చేస్తారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని మానిటరింగ్ చేయనుంది ప్రభుత్వం. భవిష్యత్తులో వినియోగదారుల నుంచి కేవలం రూ. 500 చెల్లించేలా ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. 48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్‌లోకి సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్‌ఫ‌ర్‌ అయ్యేలా ఏర్పాట్లు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రూ.500 కే పేదలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది. దీని అమలుపై విపక్షాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రూ.500కే సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు వీలుగా మార్గదర్శకాలతో ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.

Tags:    
Advertisement

Similar News