భారతీయుడు-2 సినిమాకు రేవంత్‌ బంపరాఫర్‌

సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఇప్పటికే హీరోలు కమల్‌హాసన్, సిద్ధార్థ్‌ డ్రగ్స్‌ వినియోగాన్ని వ్యతిరేకిస్తూ వీడియోలు సైతం విడుదల చేశారు.

Advertisement
Update:2024-07-10 18:20 IST

భారతీయుడు-2 సినిమాకు తెలంగాణ సర్కార్ బంపరాఫర్ ఇచ్చింది. టికెట్ రేట్లు పెంచుకోవడంతో పాటు అదనంగా మరో షో(ఐదో షో)కు అనుమతి ఇచ్చిం. ఈ మేరకు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 12న సినిమా రిలీజ్ కానుండగా.. వారం రోజుల పాటు టికెట్ ధరల పెంపు, అడిషనల్‌ షోకు పర్మిషన్ ఇచ్చింది.

సింగిల్ స్క్రీన్‌లో రూ.50 ప్లస్ జీఎస్టీ అదనం, మల్టిప్లెక్స్‌లలో రూ. 75 జీఎస్టీ అదనంగా టికెట్ల రేట్లు పెరగనున్నాయి. సినిమా రిలీజ్ కానున్న 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ పెరిగిన ధరలు అందుబాటులో ఉండనున్నాయి. ఇక డ్రగ్స్ వినియోగం, వాటి దుష్ప్రభావాలకు సంబంధించిన యాడ్‌ను తప్పనిసరిగా ప్లే చేయాలని థియేటర్లకు కండీషన్ పెట్టింది తెలంగాణ సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఇప్పటికే హీరోలు కమల్‌హాసన్, సిద్ధార్థ్‌ డ్రగ్స్‌ వినియోగాన్ని వ్యతిరేకిస్తూ వీడియోలు సైతం విడుదల చేశారు.



1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను భారతీయుడు-2 పేరుతో శంకర్ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో కమల్‌హాసన్‌, కాజల్ అగర్వాల్, రకుల్‌ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్‌, సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్‌ రిలీజ్ చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News