తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ.. ఆమ్రపాలికి కీలక పోస్టు!
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆమ్రపాలికి కీలకమైన పోస్టులు ఇస్తూ వస్తోంది ప్రభుత్వం. తాజాగా GHMC పూర్తిస్థాయి కమిషనర్‌గా నియమించడం కూడా చర్చనీయాంశమైంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ సహా అదనపు బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, మూసీ డెవలప్‌మెంట్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ బాధ్యతల నుంచి ఆమ్రపాలిని రిలీవ్ చేసిన ప్రభుత్వం.. GHMC కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది.
ఇక మూసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దానకిశోర్‌ను నియమించిన ప్రభుత్వం.. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సర్ఫరాజ్ అహ్మద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక HMDA జాయింట్ కమిషనర్‌గా కోట శ్రీవాస్తవ, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా చహత్ బాజ్‌పాయ్, హైదరాబాద్ జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మయాంక్ మిత్తల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆమ్రపాలికి కీలకమైన పోస్టులు ఇస్తూ వస్తోంది ప్రభుత్వం. తాజాగా GHMC పూర్తిస్థాయి కమిషనర్‌గా నియమించడం కూడా చర్చనీయాంశమైంది. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలికి కమిషనర్ స్థాయి అనుభవం లేదన్న చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటరీగా పని చేసే అనుభవం కూడా లేని ఆమ్రపాలికి.. అంతకుమించిన కమిషనర్ పోస్టు అప్పగించడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.