తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు.. సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్రకు అదనపు బాధ్యతలు

హోంగార్డు అడిషనల్ డీజీగా అభిలాష బిస్తు, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ అడిషనల్ డీజీగా శ్రీనివాసరావు, నల్గొండ ఎస్పీగా రెమా రాజేశ్వరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Update:2023-01-04 08:02 IST

తెలంగాణ రాష్ట్రంలో చాన్నాళ్ల తర్వాత భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అత్యున్నత స్థాయిలో కొంత మందికి ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించి, బదిలీలు చేసింది. తాజాగా పలువురు సీనియర్ పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీవీ ఆనంద్‌కు యాంటి నార్కోటిక్స్ బ్యూరో ఏడీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక స్టీఫెన్ రవీంద్రకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. మిగిలిన వారి బదిలీలు ఇలా ఉన్నాయి.

1. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ - రాజీవ్ రతన్

2. పోలీస్ అకాడమీ డైరెక్టర్ - సందీప్ శాండిల్య

3. అర్గనైజేషన్, లీగల్ అడిషనల్ డీజీ - శ్రీనివాస్ రెడ్డి

4. రైల్వే అడిషనల్ డీజీ - శివధర్ రెడ్డి

5. పోలీస్ వెల్ఫేర్, స్పోర్ట్స్ అడిషనల్ డీజీ - అభిలాష బిస్తు

6. వుమెన్ సెక్యూరిటీ, షీటీమ్స్ అడిషనల్ డీజీ - షికా గోయల్

7. టీఎస్ఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీ - స్వాతీ లక్రా

8. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అడిషనల్ డీజీ - విజయ్ కుమార్

9. స్టేట్ ఫైర్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ - నాగిరెడ్డి

10. హైదరాబాద్ అడిషనల్ సీపీ (లా అండ్ ఆర్డర్) - విక్రమ్ సింగ్ మాన్

11. హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ - సుధీర్ బాబు

12. మల్టీజోన్-2 ఐజీ - షానవాజ్ ఖాసిం

13. పోలీస్ ట్రైనింగ్ ఐజీ - తరుణ్ జోషి

14. ఐజీ (పర్సనల్) - కమలాసన్ రెడ్డి

15. మల్టీజోన్ -1 ఐజీ - చంద్రశేఖర్ రెడ్డి

16. డీఐజీ (పీ అండ్ ఎల్) - రమేశ్

17. ఇంటెలిజెన్స్ డీఐజీ - కార్తికేయ

18. రాజన్న జోన్ డీఐజీ - రమేశ్ నాయుడు

19. సీఏఆర్ జాయింట్ సీపీ - ఎం. శ్రీనివాసులు

20. ఐఎస్‌డబ్ల్యూ డీఐజీ - తఫ్సీర్ ఇక్బాల్

21. రాచకొండ జాయింట్ సీపీ - గజరావు భూపాల్

22. యాదాద్రి జోన్ డీఐజీ - రెమా రాజేశ్వరి

23. జోగులాంబ జోన్ డీఐజీ - ఎల్ఎస్ చౌహాన్

24. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ - నారాయణ నాయక్

25. హైదరాబాద్ జాయింట్ సీపీ (అడ్మినిస్ట్రేషన్) - పరిమళ

26. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీ - ఆర్. భాస్కరన్

ఇక హోంగార్డు అడిషనల్ డీజీగా అభిలాష బిస్తు, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ అడిషనల్ డీజీగా శ్రీనివాసరావు, నల్గొండ ఎస్పీగా రెమా రాజేశ్వరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    
Advertisement

Similar News