మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. - తగ్గిన ధరలు
ఫుల్ బాటిల్‌పై రూ.40, హాఫ్ బాటిల్‌పై రూ.20, క్వార్టర్ బాటిల్‌పై రూ.10 చొప్పున ధరలు తగ్గించారు. కొన్ని రకాల బ్రాండ్లు ఫుల్ బాటిల్‌పై రూ.60 వరకు కూడా తగ్గినట్టు తెలంగాణ ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించింది. శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. తగ్గిన ధరలు కూడా ఇదే రోజు నుంచే అమలులోకి వచ్చాయని కూడా తెలిపింది. మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మద్యం ధరలు తగ్గాయి. బీర్ మినహా.. లిక్కర్ కు చెందిన అన్ని బ్రాండ్లపైనా ధరలు తగ్గడం గమనార్హం.
ఫుల్ బాటిల్‌పై రూ.40, హాఫ్ బాటిల్‌పై రూ.20, క్వార్టర్ బాటిల్‌పై రూ.10 చొప్పున ధరలు తగ్గించారు. కొన్ని రకాల బ్రాండ్లు ఫుల్ బాటిల్‌పై రూ.60 వరకు కూడా తగ్గినట్టు తెలంగాణ ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
అధిక ధరల కారణంగా బయటి రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మద్యం అక్రమంగా వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్రమ మద్యం రవాణాను నియంత్రించేందుకే ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించినట్టు అధికారులు తెలిపారు.
నేటినుంచి తయారయ్యే మద్యం బాటిళ్లపై కొత్త మద్యం ధరలు ప్రింట్ అవుతాయని అధికారులు తెలిపారు. అందుకు అనుగుణంగా లిక్కర్ తయారీ కంపెనీలకు ఆదేశాలు కూడా ఇచ్చినట్టు వెల్లడించారు. ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం మందుబాబుల దిల్‌ఖుష్ చేయడం ఖాయం.