1,365 గ్రూప్-3, 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ

TS Jobs Recruitment: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-3 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ, స్టాఫ్ నర్స్ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఆర్బీ) ద్వారా భర్తీ చేయనున్నారు.

Advertisement
Update:2022-12-30 18:50 IST

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉన్నది. ఈ వారంలోనే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం.. తాజాగా రెండు భారీ ఉద్యోగ ప్రకటనలు ఇచ్చింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-3 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ, స్టాఫ్ నర్స్ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఆర్బీ) ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన రెండు నోటిషికేషన్లు కూడా శుక్రవారం విడుదల కావడంతో నిరుద్యోగులు ఆనందంలో మునిగిపోయారు.

గ్రూప్-3 కింద వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,365 పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దీనికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆర్థిక శాఖలో అత్యధికంగా 712 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఉన్నత విద్యా శాఖలో 89 పోస్టులు భర్తీ చేయనున్నారు. అన్ని శాఖల్లో పోస్టుల వివరాల కోసం కింద ఉన్న నోటిఫికేషన్ గమనించండి.



 భారీగా స్టాఫ్ నర్స్ పోస్టులు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, రెసిడెన్షియల్ హాస్టల్స్, కాలేజీల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ఎంహెచ్ఆర్బీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 5,204 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మెడికల్ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద 3,823 పోస్టులతో పాటు.. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 757, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 81 స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి.

వీటితో పాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్‌లో 8, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ సొసైటీలో 127, మహాత్మా జ్యోతిబా పూలీ తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీలో 197, గురుకులాల్లో 74, సోషల్ వెల్ఫేర్‌లో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన ఇన్‌స్టిట్యూషనల్ సొసైటీలో 13 పోస్టులు భర్తీ కానున్నాయి. 2023 జనవరి 25 నుంచి ఫివ్రవరి 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్ పద్దతిలో పని చేస్తున్న వారికి వెయిటేజీ కూడా ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.



 


Tags:    
Advertisement

Similar News