ఈ-మొబిలిటీ రంగంలో నూతన ఆవిష్కర్తల‌ను ఆహ్వానిస్తున్న తెలంగాణ‌ ప్రభుత్వం

ఈ మొబిలిటీ ఛాలెంజ్ లో మొదటి విజేతకు రూ. 10 లక్షల వరకు గ్రాంట్లు ఇవ్వబడతాయి. రన్నరప్‌లకు రూ. 5 లక్షల వరకు గ్రాంట్‌లు అందజేయబడతాయి. విజేతలు T-Hub స్టార్ట్-అప్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్‌లలో నమోదు చేయబడతారు.

Advertisement
Update:2023-01-31 15:32 IST

ఎలక్ట్రిక్, మొబిలిటీ రంగాలలో ఆవిష్కరణలను వేగవంతం చేసే లక్ష్యంతో, తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కర్తలను ఆహ్వానిస్తోంది. కొత్త‌ వ్యాపార ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించడానికి 'మొబిలిటీ గ్రాండ్ స్టార్టప్ ఛాలెంజ్' పేరుతో భారతీయ స్టార్టప్‌లను ఆహ్వానించింది. .

ఈ ఛాలెంజ్ లో పాల్గొనే స్టార్టప్‌లు భారతీయ ఇ-మొబిలిటీ రంగంలోని కీలక సమస్యలను పరిష్కరించడానికి తమ వినూత్న ఆలోచనలను సమర్పించనున్నాయి. ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలే ఫిబ్రవరి 7, 2023న హైదరాబాద్ ఇ-మొబిలిటీ వీక్ సందర్భంగా నిర్వహించబడుతుంది. ఇందులో టాప్ ఏడు స్టార్టప్ లు ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమ అనుభవజ్ఞులు, స్టార్టప్ ల‌ వ్యవస్థాపకులు, అకడమీషియన్లతో కూడిన జ్యూరీకి తమ ఆలోచనలను వివరిస్తాయి

2023 ఫిబ్రవరి 5-11 మధ్య జరుగుతున్న హైదరాబాద్ ఇ-మొబిలిటీ వీక్‌లో భాగంగా నిర్వహించబడుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీకి ప్రపంచంలోనే ప్రఖ్యాత ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థ TVS మోటార్ కంపెనీ ప్రత్యేక భాగస్వామి. .

పరిశ్రమలు & వాణిజ్యం (I&C), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఈ పోటీ గురించి మాట్లాడుతూ, “ ఈ గ్రాండ్ ఛాలెంజ్ స్టార్ట్-అప్‌లకు సాంకేతిక నిపుణులతో సంభాషించడానికి, వారి నుండి ఇన్‌పుట్‌లను పొందడానికి, వారు తమ‌ తదుపరి మెట్టు ఎక్కడానికి ఒక ప్రత్యేకమైన వేదికను అందిస్తుంది. ఈ రంగానికి సంబంధించి తమ సరికొత్త ఆవిష్కరణలు, ఆలోచనలను ప్రదర్శించడానికి స్టార్టప్‌లందరినీ హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నాము.'' అని చెప్పారు.

ఈ మొబిలిటీ ఛాలెంజ్ లో మొదటి విజేతకు రూ. 10 లక్షల వరకు గ్రాంట్లు ఇవ్వబడతాయి. రన్నరప్‌లకు రూ. 5 లక్షల వరకు గ్రాంట్‌లు అందజేయబడతాయి. విజేతలు T-Hub స్టార్ట్-అప్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్‌లలో నమోదు చేయబడతారు. ప్రముఖ పరిశ్రామికవేత్తల‌ నుండి మార్గదర్శకత్వం పొందుతారు.

దేశవ్యాప్తంగా 100+ స్టార్టప్‌లు ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేశాయి. పాల్గొనే అన్ని స్టార్టప్‌లు వాటి నూతన‌ ఆవిష్కరణ, వాటి సాధ్యాసాధ్యాల‌ ఆధారంగా మూల్యాంకనం చేయబడతాయి.

జ్యూరీలో అపోలో టైర్స్, మార్కెటింగ్ గ్రూప్ హెడ్ విక్రమ్ గర్గా, TVS మోటార్ కంపెనీ EV మైక్రోమొబిలిటీ హెడ్ సంజీవ్ పి, ZF రేస్ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ సాస్చా రికానెక్, బిలిటి ఎలక్ట్రిక్ కో-ఫౌండర్ & COO హర్ష బవిరిసెట్టి వంటి ఇండస్ట్రీ వెటరన్లు, TiHan డైరెక్టర్ ప్రొఫెసర్ రాజలక్ష్మి పి, IIT హైదరాబాద్ ఇన్నోవేషన్ హబ్‌తో పాటు ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు.   

Tags:    
Advertisement

Similar News