పంట నష్టానికి పరిహారం నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6 వరకు కురిసిన అతి భారీ వర్షాల వలన రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాలలో 79,574 ఎకరాల్లో పంట నష్టం సంబవించినట్లు అధికారులు నిర్ధారించారు.

Advertisement
Update:2024-10-09 20:24 IST

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6 వరకు కురిసిన భారీ వర్షాల వలన జరిగిన పంట నష్టాం..రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాలలో 79,574 ఎకరాల్లో పంట నష్టం సంబవించినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా పంట నష్టానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేవలం నెల రోజుల వ్యవధిలోనే పంట నష్టపోయిన రైతులకు పరిహారం కింద రూ. 79.57 కోట్ల నిధులు విడుదల చేశారు. దీనిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారికంగా ప్రకటించారు.

మంత్రి ఉత్తర్వుల ప్రకారం.. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 28,407 ఎకరాల్లో పంట నష్టం జరగ్గా.. మహబూబాబాద్ 14,669, సూర్యాపేట 9,828 ఎకరాల్లో సంభవించిందని.. మిగతా 22 జిల్లాలకు సంబంధించి అత్యల్పంగా 19 ఎకరాల నుంచి 3,288 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు నిర్ధారించారు. కాగా పంట నష్ట పరిహారం ఎకరానికి 10 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అయ్యేటట్లు అధికారులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News