పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచిన తెల‍ంగాణ సర్కార్

జీహెచ్‌ఎంసీ, జలమండలి, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు వేయిరూపాయల చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు నుంచే ఈ నిర్ణయం అమలులోకి రానుంది.

Advertisement
Update:2023-05-01 18:33 IST

పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచిన తెల‍ంగాణ సర్కార్మేడే రోజున పారిశుధ్య కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ వినిపించించి. వారికి జీతాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.

జీహెచ్‌ఎంసీ, జలమండలి, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు వేయిరూపాయల చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు నుంచే ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ఈ నిర్ణయంతో 1,06,474 మంది పారిశుధ్య కార్మికులకు లబ్ధి చేకూరనున్నది. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు ఆర్టీసీ కార్మికుల వేతనాలు కూడా పెంచాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వేతనాల పెంపుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థికశాఖను ఆదేశించారు. 

Tags:    
Advertisement

Similar News