ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3.64 శాతం కరవు భత్యం (డీఏ) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisement
దీపావళి పండుగ సందర్బంగా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 3.64 శాతం కరవు భత్యం (డీఏ) పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నారు. 2022 జులై ఒకటి నుంచి 2024 అక్టోబర్ 31 వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు.
ఇక 2022 జులై నుండి 2024 అక్టోబర్ 31 వరకు గల డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. 2025 మార్చిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగుల డీఏ బకాయిలు మాత్రం 17 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే జీపీఎఫ్ ఖాతాలు లేని కంటిజెంట్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 బకాయిల్లో ఈ మొత్తం అందివ్వనున్నారు.
Advertisement