రైతులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్.. రుణమాఫీకి రూ. 6,385 కోట్ల కేటాయింపు
రైతుల రుణమాఫీ కోసం రూ. 6385 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు హరీశ్ రావు.వ్యవసాయ శాఖకు కేటాయించిన రూ. 26,931 కోట్లకు ఇది అదనం అని హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
Advertisement
ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన హరీశ్ రావు అందులో ప్రధానంగా రైతుల సంక్షేమం కోసమే ఎక్కువ నిధులు కేటాయించారు. నీటిపారుదల, వ్యవసాయం, విద్యుత్ రంగాలకు అధిక నిధులు కేటాయించిన ప్రభుత్వం, రైతులు ఎప్పటి నుంచో ఎదిరి చూస్తున్న రుణమాఫీకోసం కూడా నిధులు కేటాయించింది.
రైతుల రుణమాఫీ కోసం రూ. 6385 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు హరీశ్ రావు.వ్యవసాయ శాఖకు కేటాయించిన రూ. 26,931 కోట్లకు ఇది అదనం అని హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
Advertisement