అందె శ్రీ గీతం.. కీరవాణి సంగీతం.. జూన్‌ 2న రిలీజ్‌

సీఎం రేవంత్‌ రెడ్డితో గీత రచయిత అందెశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్‌ ఎం.ఎం.కీరవాణి సమావేశమయ్యారు. ఈ గీతానికి కీరవాణి సంగీతం అందించనున్నారు.

Advertisement
Update:2024-05-22 08:43 IST

జయజయహే తెలంగాణ గీతం ఆవిష్కరణకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జూన్‌ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ గీతాన్ని ఆవిష్కరించనుంది. అందెశ్రీ రచించిన ఈ గీతాన్ని ఇప్పటికే రాష్ట్ర గీతంగా ప్రకటించింది ప్రభుత్వం.

మంగళవారం సీఎం రేవంత్‌ రెడ్డితో గీత రచయిత అందెశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్‌ ఎం.ఎం.కీరవాణి సమావేశమయ్యారు. ఈ గీతానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. జూన్‌ 2న ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ గీతాన్ని ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.

రెండు రూపాల్లో ఈ పాటను రిలీజ్ చేయనున్నారు. అందెశ్రీ రచించిన మొత్తం పాట దాదాపు 6 నిమిషాల నిడివి ఉంటుంది. ఇందులో మార్పులేమి చేయకుండా అలాగే విడుదల చేయనున్నారు. అయితే అధికారిక కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా 60-90 సెకన్ల నిడివికి మించకుండా మార్పులు చేసి మరో వెర్షన్‌ కూడా విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రధాన గీతంలోని భావోద్వేగాలు చెదరకుండా మార్పులు చేసే బాధ్యతను అందెశ్రీకి అప్పగించారు. 

Tags:    
Advertisement

Similar News