ఫ్యాక్ట్ చెక్: మెడికల్ కాలేజీల ఘనత కేసీఆర్ దా..? కేంద్రానిదా..??
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలను, కేంద్ర ప్రభుత్వం ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. 'ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ' అసలు నిజమేంటో ప్రజలకు తెలియజేసింది.
తెలంగాణలో కొత్తగా 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటవుతున్నాయి. దీనికి కారణం ఎవరు..? కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిందా..? అనుమతుల వరకే ఇచ్చి సరిపెట్టిందా..? ఈ క్రెడిట్ ఎవరి ఖాతాలో వేయాలి..? జిల్లాకో మెడికల్ కాలేజీకోసం సీఎం కేసీఆర్ చేసిన కృషి ఫలితమే కొత్త కాలేజీల ఏర్పాటు. కానీ బీజేపీ నేతలు మాత్రం అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కేంద్రం తెలంగాణకు కొత్తగా 9 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందని స్టేట్ మెంట్లిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలను, కేంద్ర ప్రభుత్వం ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. 'ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ' దీన్ని ధృవీకరించింది. అసలు నిజమేంటో ప్రజలకు తెలియజేసింది.
వాస్తవం ఏంటంటే..?
ఈ ఏడాది నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) దేశవ్యాప్తంగా 50 మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్, ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే కాలేజీలు కూడా ఉన్నాయి. తెలంగాణలో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీలతో పాటు మరో నాలుగు ప్రైవేట్ కాలేజీలకు NMC అనుమతులు ఇచ్చింది. ఇంతవరకు వాస్తవం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీలకు కేంద్రం కేవలం అనుమతులు మాత్రమే ఇచ్చింది. అంతేకానీ ఆ కాలేజీలు ఏర్పాటు చేయలేదు.
కేంద్రం కేవలం అనుమతులు మంజూరు చేస్తే.. కేంద్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్టు అర్థం వచ్చేలా కొందరు ప్రజా ప్రతినిధులు సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ విజ్ఞప్తి చేసింది.