రేవంత్ రెడ్డిని కలసిన తెలంగాణ డీజీపీ.. ఇంటి వద్ద భద్రత పెంపు

కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. ఆయన ఇంటి వద్ద సందడి పెరిగింది. దీంతో పోలీసులు రేవంత్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సెక్యూరిటీ పెంచారు.

Advertisement
Update:2023-12-03 13:23 IST

తెలంగాణలో కాంగ్రెస్ విజయం లాంఛనంగా మారిన సందర్భంలో రాష్ట్ర పోలీస్ బాస్ అంజనీ కుమార్.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మహేష్‌ భగవత్‌, సంజయ్‌ కుమార్‌.. మరికొందరు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. ఆయనకు భద్రత పెంచారు.

రేవంత్ రెడ్డి ఇంటికి క్యూ కడుతున్న నేతలు..

తెలంగాణ కాంగ్రెస్ లో నాయకుల మాటలు ఎలా ఉన్నా.. కార్యకర్తలు మాత్రం రేవంత్ రెడ్డి సీఎం సీఎం అంటూ హడావిడి మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో కూడా రేవంత్ రెడ్డి సీఎం అంటూ కార్యకర్తలు పోస్టింగ్ లు పెడుతున్నారు. ఈ దశలో ఆయన ఇంటికి నేతలు క్యూ కట్టారు. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. ఆయన ఇంటి వద్ద సందడి పెరిగింది. దీంతో పోలీసులు రేవంత్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సెక్యూరిటీ పెంచారు.

గెలుపు లాంఛనమే..

ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయంపై హింట్ ఇచ్చినా.. మెజార్టీ విషయంలో ఈరోజు వరకు చాలామందిలో అనుమానాలున్నాయి. మేజిక్ ఫిగర్ ని కాంగ్రెస్ చేరుకోలేకపోయినా.. ఒకటి రెండు సీట్లు మాత్రమే మెజార్టీ వచ్చినా జంపింగ్ నేతలతో దినదినగండం ఐదేళ్ల ఆయుష్షు అన్నట్టుగా ప్రభుత్వం ఉంటుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కి మెజార్టీ కంటే ఐదారు స్థానాలు ఎక్కువే వచ్చేలా ఉంది. దీంతో కాంగ్రెస్ ధీమాగా కనపడుతోంది. క్యాంప్ రాజకీయాల్లో మరీ అంత హడావిడి పడాల్సిన పనిలేదని స్పష్టమవుతోంది.

Tags:    
Advertisement

Similar News