రోహిత్ వేముల కేసులో పోలీసుల యూటర్న్
కేసు పునర్విచారణకు అనుమతి ఇవ్వాలని ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు పోలీసులు. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని తన హాస్టల్ గదిలో రోహిత్ వేముల సూసైడ్ చేసుకున్నాడు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల సూసైడ్ కేసులో తెలంగాణ పోలీసులు యూటర్న్ తీసుకున్నారు. రోహిత్ కేసులో శుక్రవారం కోర్టుకు క్లోజర్ రిపోర్టు సమర్పించిన పోలీసులు.. HCU విద్యార్థుల ఆందోళనతో దిగివచ్చారు. ఈ కేసులో తిరిగి విచారణ కొనసాగించాలని నిర్ణయించారు.
శుక్రవారం రోహిత్ వేముల సూసైడ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని.. అతను ఎస్సీ కాదంటూ హైకోర్టుకు పోలీసులు క్లోజర్ రిపోర్టు సమర్పించడం వివాదానికి దారి తీసింది. మాజీ వీసీ అప్పారావుతో పాటు పలువురు బీజేపీ నేతలను సైతం ఈ కేసు నుంచి తప్పించారు పోలీసులు. దీనిపై HCU విద్యార్థులు శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గతంలో రోహిత్ వేములకు మద్ధతుగా నిలిచిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే కేసు క్లోజ్ చేయడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తిరిగి కేసును రీఓపెన్ చేస్తామని డీజీపీ హామీ ఇవ్వడంతో విద్యార్థి సంఘాలు వెనక్కి తగ్గాయి.
కేసు పునర్విచారణకు అనుమతి ఇవ్వాలని ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు పోలీసులు. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని తన హాస్టల్ గదిలో రోహిత్ వేముల సూసైడ్ చేసుకున్నాడు. రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఆందోళనలకు దారి తీసింది.