గర్జనలు, డిక్లరేషన్లు.. తెలంగాణ కాంగ్రెస్ కొత్త వ్యూహాలు

10 రోజుల్లో మండల కమిటీల నియామకాలు పూర్తి చేస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దశాబ్ది ఉత్సవాలకు వ్యతిరేకంగా 22 నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Advertisement
Update:2023-06-18 09:14 IST

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఏడాది చివర్లోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెట్టాయి. కర్నాటక విజయంతో జోరుమీదున్న కాంగ్రెస్.. తెలంగాణలో కూడా అలాంటి ఫలితాలు సాధిస్తామని చెబుతోంది. బీఆర్ఎస్ ని ఢీకొట్టడం అంత తేలిక కాదని తెలుసు కాబట్టి, కనీసం బీజేపీని పూర్తి స్థాయిలో వెనక్కు నెట్టి, జాతీయ స్థాయిలో కాషాయదళాన్ని ఇరుకున పెట్టే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది.

డిక్లరేషన్లు, గర్జనలు..

ఇప్పటికే పాదయాత్రలతో కాంగ్రెస్ నాయకులు బిజీగా ఉన్నారు. కేంద్ర నాయకత్వం వచ్చినప్పుడు గర్జనలు, డిక్లరేషన్లతో మరింతగా ప్రజల ఆదరణకోసం ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలనాటికి ఈ గర్జనలు, డిక్లరేషన్ల సంఖ్య మరింత పెంచాలని తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయించింది. వచ్చే ఐదు నెలల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా గర్జనలు నిర్వహించాలని తీర్మానించారు. నెలాఖరులోపు బీసీ గర్జన.. డిక్లరేషన్ చేపడతామన్నారు. ఆ తర్వాత 15 రోజులకో డిక్లరేషన్ ఇస్తామన్నారు.

నియామకాలు పూర్తి చేస్తాం..

10 రోజుల్లో మండల కమిటీల నియామకాలు పూర్తి చేస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలు.. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలుగా మారిపోయాయని విమర్శించారాయన. అధికారులెవరూ కార్యాలయాల్లో అందుబాటులో ఉండటం లేదన్నారు. దశాబ్ది ఉత్సవాలకు వ్యతిరేకంగా 22 నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రజల్ని సమీకరించి నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత పీఏసీ మీటింగ్ కి జగ్గారెడ్డి హాజరు కావడం విశేషం. 

Tags:    
Advertisement

Similar News