అమ‌రుల త్యాగ ఫ‌లితం, తెలంగాణ ఆత్మ‌గౌరవానికి గుర్తు కొత్త సచివాలయం.. కేసీఆర్

నూతన‌ సచివాలయ నిర్మాణం తెలంగాణ అమరుల త్యాగఫలమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఆత్మ‌గౌర‌వాన్ని ఈ స‌చివాల‌యం ఇనుమ‌డింప‌జేస్తుంద‌న్నారు.

Advertisement
Update:2022-11-17 23:18 IST

నూతనంగా నిర్మాణమవుతున్న సచివాలయాన్ని గురువారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. దాదాపు మూడు గంటల పాటు సచివాలయ ప్రాంగణమంతా కలియతిరిగారు కేసీఆర్. ప్రతి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించారు. పనులు ఎంతవరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ప్రతి అంతస్తును ఎక్కి చూశారు. సీఎం తో పాటు మంత్రులు వేముల ప్ర‌శాంత్ రెడ్డి, హ‌రీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, జ‌గ‌దీశ్ రెడ్డితో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంజినీర్లు, అధికారులు ఉన్నారు

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఈ సచివాలయ నిర్మాణం తెలంగాణ అమరుల త్యాగఫలమన్నారు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వాన్ని ఈ స‌చివాల‌యం ఇనుమ‌డింప‌జేస్తుంద‌న్నారు. గత వందేళ్ళలో ఇటువంటి సచివాలయం మరే రాష్ట్రంలోనూ నిర్మించలేదన్నారు. ధోల్‌పూర్ స్టోన్‌ను వాడిన క‌ట్ట‌డం దేశంలోనే ఎక్కడా లేదని కేసీఆర్ చెప్పారు.

ఒక్క సచివాలయ నిర్మాణం మాత్రమే కాదని దీని ఎదురుగా అమరవీరుల స్తూపం నిర్మాణం జరుగుతోందని, అది కూడా త్వరలోనే పూర్తవుతుందన్నారు. అమరుల త్యాగాలను, వారి పోరాట స్పూర్తిని ప్రతిరోజూ గుర్తుంచుకునేలా ఆ స్తూపం ఉంటుందన్నారు.

సచివాలయం పక్కనే అత్యంత ఎత్తైన, మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు కేసీఆర్ . ఆ విగ్రహం ప్రతిక్షణం మన కర్తవ్య నిర్వహణను గుర్తు చేస్తూ ఉంటుందన్నారు ముఖ్యమంత్రి.

నూతన సచివాలయ నిర్మాణ పనులను చూసి కేసీఆర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంజనీర్లకు పలు సలహాలు ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News