రంజాన్ స్పెషల్ ముబారక్.. ముస్లింలకు కేసీఆర్ గుడ్ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, బోర్డులు, ప్రభుత్వ రంగంలో ఉన్న ముస్లిం ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

Advertisement
Update:2023-03-20 21:44 IST
రంజాన్ స్పెషల్ ముబారక్.. ముస్లింలకు కేసీఆర్ గుడ్ న్యూస్
  • whatsapp icon

రంజాన్ మాసం మొదలయ్యే సమయంలో ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 23నుంచి ఏప్రిల్ 23 వరకు ముస్లిం ఉద్యోగులు, విద్యార్థులు గంట ముందుగానే తమ కార్యాలయాలు, కాలేజీలనుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు తాజాగా విడుదలయ్యాయి. రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు చేసేవారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

ముస్లింలకు పవిత్రమాసం రంజాన్. రంజాన్ లో ప్రతి రోజూ ఉపవాస దీక్ష చేపడతారు ముస్లింలు, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సాయంత్రం ప్రార్ధనల్లో పాల్గొనడానికి అనుకూలంగా ముస్లిం ఉద్యోగులు గంట ముందుగానే బయటకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, బోర్డులు, ప్రభుత్వ రంగంలో ఉన్న ముస్లిం ఉద్యోగులకు ఈమేరకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా అందరూ ప్రార్థనలు చేసేందుకు కార్యాలయాలు, పాఠశాలల నుంచి గంట ముందుగా బయటకు వెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

టీఎస్-ఎంఎస్ సెంట్రల్ అసోసియేషన్ హైదరాబాద్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. పవిత్ర రంజాన్ నెలలో కొంత సమయం ముందుగా కార్యాలయాలనుంచి బయలుదేరడానికి ఉద్యోగులకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ముస్లిం ఉద్యోగులు స్వాగతించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News