యుద్ధ ప్రాతిపదికన యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశం

రాష్ట్రంలోని రైతులు తమ వరి ధాన్యాన్ని అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు రాష్ట్రంలో 7 వేల యాసంగి వరి ధాన్య‍ం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.

Advertisement
Update:2023-04-09 21:37 IST

తెలంగాణలో యుద్ధ ప్రాతిపదికన యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని రైతులు తమ వరి ధాన్యాన్ని అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు రాష్ట్రంలో 7 వేల యాసంగి వరి ధాన్య‍ం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఈ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌లను కేసీఆర్ ఆదివారంనాడు ఆదేశించారు.

మధ్యంతర చర్యల్లో భాగంగా, అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, వరి ధాన్యం సేకరణ ప్రక్రియ కోసం చేపట్టాల్సిన అన్ని చర్యలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిని కోరారు.

గతంలో మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలుకు కసరత్తు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.

Tags:    
Advertisement

Similar News