23న తెలంగాణ కేబినెట్‌ మీటింగ్‌

సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్‌ లోని ఆరో ఫ్లోర్‌ లో సమావేశం

Advertisement
Update:2024-10-17 15:30 IST

తెలంగాణ కేబినెట్‌ ఈనెల 23న సమావేశం కానుంది. 23న సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్‌ లోని ఆరో ఫ్లోర్‌ గల కాన్ఫరెన్స్‌ హాల్‌ నిర్వహించే కేబినెట్‌ సమావేశంలో పాల్గొనాలని సీఎస్‌ శాంతి కుమారి మంత్రులు, అన్ని శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కేబినెట్‌ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోదముద్ర వేయనున్నారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ తీసుకురవడానికి ఆమోదం తెలుపుతారు. హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్‌ లో పలు సవరణలు ప్రతిపాదిస్తారని సమాచారం. గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనున్నారు. ఈ ఉద్యోగాల్లో వీఆర్వో, వీఆర్‌ఏలతో సగం, మిగతా సగం ఉద్యోగాలు కొత్త వారితో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆమోదముద్ర వేయనున్నారు. మూసీ నిర్వాసితులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. హైడ్రా, కొత్త రెవెన్యూ బిల్లులను అసెంబ్లీ, కౌన్సిల్‌ లో ప్రవేశ పెట్టి ఉభయ సభల ఆమోదం పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ రెండు డ్రాఫ్ట్‌ బిల్లులపైనా కేబినెట్‌ భేటీలో చర్చిస్తారు. నవంబర్‌ మొదటి వారంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో.. అసెంబ్లీ సమావేశాల తేదీలపైనా సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.




 


Tags:    
Advertisement

Similar News