తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే

TS Inter 1st, 2nd year Time Table 2023: ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ 2023 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు జరుగనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.

Advertisement
Update:2022-12-19 18:52 IST

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కోసం రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ 2023 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు జరుగనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.

ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ ఎగ్జామ్‌ను 2023 మార్చి 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను మార్చి 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు ఎగ్జామ్స్‌ విభాగం జాయింట్‌ సెక్రెటరీ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు.ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 15న, సెకెండ్ ఇయర్ ఎగ్జామ్స్ మార్చి 16 నుంచి ప్రారంభం అవుతాయి.

ఇదే షెడ్యూల్

ఇంట‌ర్‌ ఫస్టియర్ ఎగ్జామ్స్:

మార్చి 15 - బుధవారం - 2nd లాంగ్వేజ్ పేపర్ 1

మార్చి 17 - శుక్రవారం - ఇంగ్లీష్ పేపర్ 1

మార్చి 20 - సోమవారం - మ్యాథ్స్‌ పేపర్‌ 1ఎ, బోటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1

మార్చి 23 - గురువారం - మ్యాథ్స్ 1బి, హిస్టరీ పేపర్ 1, జువాలజీ పేపర్ 1

మార్చి 25 - శనివారం - ఫిజిక్స్ పేపర్ 1, ఎకనావిుక్స్‌ పేపర్ 1

మార్చి 28 - మంగళవారం - కెవిుస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1

మార్చి 31 - శుక్రవారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్ 1 (బైపీసీ విద్యార్థులకు)

ఏప్రిల్ 3 - సోమవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1

ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్:

మార్చి 16 - గురువారం - సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్ 2

మార్చి 18 - శనివారం - ఇంగ్లీష్‌ పేపర్ 2

మార్చి 21 - మంగళవారం - మ్యాథ్స్‌ పేపర్‌ 2ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్‌ 2

మార్చి 24 - శుక్రవారం - మ్యాథ్స్ పేపర్ 2బి, హిస్టరీ పేపర్‌ 2, జువాలజీ పేపర్‌ 2

మార్చి 27 - సోమవారం - ఫిజిక్స్ పేపర్‌ 2, ఎకనావిుక్స్‌ పేపర్‌ 2

మార్చి 29 - బుధవారం - కెవిుస్ట్రీ పేపర్‌ 2, కామర్స్ పేపర్‌ 2

ఏప్రిల్ 1 - శనివారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్‌ 2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్‌ 2 (బైపీసీ విద్యార్థులకు)

ఏప్రిల్ 4 - మంగళవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్‌ 2, జియోగ్రఫీ పేపర్‌ 2



 


Tags:    
Advertisement

Similar News