తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

తెలంగాణ శాసన సభ నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు.

Advertisement
Update:2024-12-21 16:42 IST

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఇవాళ శాసన సభలో రైతు భరోసా పధకంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం చిత్ర పరిశ్రమకు భవిష్యత్‌లో ఎలాంటి రాయితీలు ఇవ్వబోమని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి, మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. డిసెంబర్ 9న ప్రారంభమైన శాసనసభ సమావేశాలు ఈ నెల 21 వ తేదీ శనివారం వరకు కొనసాగాయి. మొత్తంగా 7 రోజులు శాసనసభ సమావేశాలు కొనసాగా, ఈ సెషన్ లో సభ మొత్తం 37 గంటల 44 నిమిషాల పాటు సాగినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఈ సెషన్ లో సభ మొత్తం 8 బిల్లులకు ఆమోదం తెలిపింది.

చివరి రోజు రైతుభరోసాపై స్వల్ప వ్యవధి చర్చ ముగిసింన తర్వాత నిరవధిక వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. బీజేపీ సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ ఆరు గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్థిక సహాయం అందించాలని ఇచ్చిన వాయిదా ప్రతిపాదనును, కొత్తగూడెెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇచ్చిన రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించారు.

Tags:    
Advertisement

Similar News