తెలంగాణ అకడమిక్ క్యాలెండర్ విడుదల

2023 జూన్‌ 12న పాఠశాలలు ప్రారంభం అవుతాయి. 2024 ఏప్రిల్‌ 23న చివరి వర్కింగ్ డే. అంటే ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేస్తాయి.

Advertisement
Update:2023-06-06 22:15 IST

నూతన విద్యాసంవత్సరానికి తెలంగాణ అకడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు విద్యాశాఖ అధికారులు. 1నుంచి 10 తరగతులకు సంబంధించి తరగతులు, పరీక్షలు, సెలవల వివరాలు ఇందులో పొందుపరిచారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలకు విద్యాశాఖలోని వివిధ విభాగాల డైరెక్టర్లకు ఈ క్యాలెండర్ ని పంపించారు.

జూన్ 12న స్కూల్స్ ప్రారంభం..

2023 జూన్‌ 12న పాఠశాలలు ప్రారంభం అవుతాయి. 2024 ఏప్రిల్‌ 23న చివరి వర్కింగ్ డే. అంటే ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేస్తాయి. 2024 ఏప్రిల్‌ 24 నుంచి 2024 జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఇస్తారు. 2024 జనవరి 10న పదో తరగతి సిలబస్‌ పూర్తిచేసి, SSC బోర్డ్‌ ఎగ్జామినేషన్‌ లోపల రివిజన్‌ క్లాసులు, ప్రీ ఫైనల్‌ పరీక్షలు పూర్తిచేయబోతున్నట్టు ఈ క్యాలెండర్ లో పేర్కొన్నారు. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు సిలబస్‌ ను 2024 ఫిబ్రవరి 29నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఉదయం పూట జరిగే అసెంబ్లీ అనంతరం ప్రతి రోజూ 5 నిమిషాలు యోగా సెషన్‌ నిర్వహించాలని సూచించారు అధికారులు.

పరీక్షలు.. తేదీలు

ఫార్మేటివ్‌ అసెస్‌ మెంట్‌ (FA)-1 పరీక్షలు జూలై 31లోపు

ఫార్మేటివ్‌ అసెస్‌ మెంట్‌ (FA)-2 పరీక్షలు సెప్టెంబర్‌ 30లోపు

సమ్మేటివ్‌ అసెస్‌ మెంట్‌ (SA)-1 పరీక్షలు అక్టోబర్‌ 5 నుంచి అక్టోబర్‌ 11 వరకు

ఫార్మేటివ్‌ అసెస్‌ మెంట్‌ (FA)-3 పరీక్షలను డిసెంబర్‌ 12 లోపు

ఫార్మేటివ్‌ అసెస్‌ మెంట్‌ (FA)-4 పరీక్షలను 2024 జనవరి 29 లోపు

సమ్మేటివ్‌ అసెస్‌ మెంట్‌ (1-9 తరగతులకు) (SA)-2 పరీక్షలను 2024 ఏప్రిల్‌ 8 నుంచి ఏప్రిల్‌ 18 వరకు

ప్రీ ఫైనల్‌ (10వ తరగతి) పరీక్షలు 2024 ఫిబ్రవరి 29లోపు నిర్వహించాలని అకడమిక్ క్యాలెండర్ లో సూచించారు.

SSC బోర్డు పరీక్షలను 2024 మార్చి నెలలో నిర్వహిస్తామని పరీక్షల షెడ్యూల్‌ లో పేర్కొన్నారు. 

Tags:    
Advertisement

Similar News