కరీంనగర్ హనుమాన్ శోభాయాత్ర వివాదంలో కొత్త ట్విస్ట్
హనుమాన్ శోభాయాత్రలో కత్తి తిప్పి వీరంగం సృష్టించిన వ్యక్తి బీజేపీ కార్యకర్తే అని తేసింది.
కరీంనగర్‌లో శనివారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హనుమాన్ శోభాయాత్ర జరుగుతున్న సమయంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. వేరే మతానికి చెందిన వ్యక్తి అనుకుని అతన్ని హనుమాన్ భక్తులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది.
ఆ వ్యక్తిని తమకు అప్పగించాలని హనుమాన్ భక్తులు పోలీసు వాహనాన్ని వెంబడించారు. ఈ క్రమంలో ఓ హనుమాన్ మాలధారుడు పోలీసు వాహనాన్ని పట్టుకుని వేలాడాడు. ఆ తర్వాత వాహనాన్ని ఆపిన పోలీసులు.. హనుమాన్ మాలధారులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు వచ్చాయి. హనుమాన్ మాలధారులపై పోలీసుల వైఖరిని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది
కాగా.. హనుమాన్ శోభాయాత్రలో కత్తి తిప్పి వీరంగం సృష్టించిన వ్యక్తి బీజేపీ కార్యకర్తే అని తేసింది. అతన్ని స్థానిక బీజేపీ నేత బాస సత్యనారాయణ అనుచరుడు జయదేవ్‌గా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకోకుండా బీజేపీ శ్రేణులు వేరే వర్గానికి చెందిన వ్యక్తి అని.. హనుమాన్ భక్తులను ఉసిగొలిపి రాద్ధాంతం చేసినట్లు చెబుతున్నారు.