పోటీ వద్దన్న చంద్రబాబు.. కాసానికి భలే ఛాన్స్

బీఆర్ఎస్ లో చేరితో కాసానికి కూడా మంచి భవిష్యత్ ఉండే అవకాశముంది. దీంతో ఆయన ఆ దిశగా ఆలోచన చేయొచ్చు. పైగా పోటీ వద్దంటూ చంద్రబాబు తేల్చి చెప్పారు కాబట్టి.. కాసానికి మంచి సాకు దొరికినట్టే.

Advertisement
Update:2023-10-29 12:09 IST

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయట్లేదు. ఇది అధికారికం. జైలులో తనతో ములాఖత్ అయిన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కు ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు చంద్రబాబు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణపై ఫోకస్ పెట్టలేమని, ప్రచారం కూడా సజావుగా సాగదని ఆయన వివరించారట.

కాసాని దారెటు..?

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీకి వెనకాడుతున్న విషయం తెలిసిందే. అయితే కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం తెలంగాణలో టీడీపీ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది, ఏపీకంటే మెరుగ్గా ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నారు. హడావిడిగా రెండుసార్లు జైలులో చంద్రబాబుని కూడా కలసి వచ్చారు. వాస్తవానికి తెలంగాణలో పోటీ చేస్తే టీడీపీకి ఒరిగేదేమీ లేదనే విషయం కాసానికి కూడా తెలుసు. కానీ పోటీ చేస్తే.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కొన్నిరోజులు ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలవొచ్చు, టికెట్ల కేటాయింపులు, ప్రచారం, బీఫామ్ ల పంపిణీ అంటూ హడావిడి చేయొచ్చు. సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మిగతా అభ్యర్థులను కంగారు పెట్టొచ్చు. ఇప్పుడీ అవకాశం కూడా కాసానికి లేదన్నమాట. దీంతో ఆయన టీడీపీకి దూరమవుతారనే వార్తలు వినపడుతున్నాయి.

ఆమధ్య బిత్తిరిసత్తితోపాటు కాసాని జ్ఞానేశ్వర్ కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారనే వార్తలు వినిపించాయి. కానీ ఆయన ఎందుకో ధైర్యం చేయలేదు. కాసానికంటే ముందు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న ఎల్.రమణ కూడా బీసీ నాాయకుడే. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. కాసాని కూడా బీసీనే. బీఆర్ఎస్ లో చేరితో కాసానికి కూడా మంచి భవిష్యత్ ఉండే అవకాశముంది. దీంతో ఆయన ఆ దిశగా ఆలోచన చేయొచ్చు. పైగా పోటీ వద్దంటూ చంద్రబాబు తేల్చి చెప్పారు కాబట్టి.. కాసానికి మంచి సాకు దొరికినట్టే.

రేవంత్ కోసమేనా..?

తెలంగాణలో టీడీపీ పోటీలో లేకపోవడంతో పరోక్షంగా ఆ ఓట్లు కాంగ్రెస్ కి ట్రాన్స్ ఫర్ అవుతాయనే ప్రచారం ఉంది. రేవంత్ రెడ్డికి ప్రయోజనం చేకూర్చేందుకే టీడీపీ పోటీనుంచి తప్పుకున్నట్టు చెబుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News