సెల్ఫీలు తీసుకుంటున్న విద్యార్థులపై దూసుకెళ్లిన ట్యాంకర్ - ఇద్దరు దుర్మరణం

ఈ ప్రమాదంలో మరి కొంతమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తీసుకెళ్లారు.

Advertisement
Update:2024-06-02 14:21 IST

రంగారెడ్డి జిల్లాలో ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన కార్లు ఆపి సెల్ఫీలు తీసుకుంటున్న విద్యార్థులపైకి ట్యాంకర్ దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వీకెండ్ కావడంతో శనివారం రాత్రి నగరానికి చెందిన పది మంది విద్యార్థులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని ఫుడ్ కోర్టుకు వెళ్లారు. అక్కడ భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి రెండు కార్లలో తిరుగు ప్రయాణం అయ్యారు.

పోలీస్ అకాడమీ వద్దకు వచ్చిన తర్వాత విద్యార్థులు తమ కార్లను రోడ్డు పక్కన ఆపి ఔటర్ రింగ్ రోడ్డులో సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన ఓ ట్యాంకర్ అదుపుతప్పి విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఓ యువతి, యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం ధాటికి వారి శరీరాలు నుజ్జునుజ్జుగా మారాయి.

ఈ ప్రమాదంలో మరి కొంతమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తీసుకెళ్లారు. ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ట్యాంకర్ డ్రైవర్ ప్రతాప్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు ఏపీలోని కృష్ణాజిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మృతులు, గాయపడ్డ వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News