ఐటీలో తెలంగాణ మాకు ఆదర్శం.. తమిళనాడు మంత్రి పీటీఆర్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఐటీ రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందని ప్రశంసించారు తమిళనాడు మంత్రి పీటీఆర్. టీ హబ్, వుయ్ హబ్, టీ వర్క్స్.. ని పరిశీలించిన ఆయన.. ఇక్కడి ప్రణాళికలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని చెప్పారు.
తమిళనాడు ఐటీ మంత్రి డాక్టర్ పిటి రాజన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణలో రెండురోజులపాటు పర్యటించింది. ఐటీ, ఇన్నోవేషన్, ఈగవర్నెన్స్ విధానాలపై ఆ బృందం అధ్యయనం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమాలు తమకు కూడా ఆదర్శం అని చెప్పారు తమిళనాడు ఐటీ మంత్రి పీటీఆర్.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఐటీ రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందని ప్రశంసించారు తమిళనాడు మంత్రి పీటీఆర్. టీ హబ్, వుయ్ హబ్, టీ వర్క్స్.. ని పరిశీలించిన మంత్రి పీటీఆర్.. ఇక్కడి ప్రణాళికలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని చెప్పారు. ఆయా వ్యూహాల అమలుతో తాము కూడా ఐటీలో మేటి అనిపించుకుంటామని తెంలగాణలోలాగే, తమిళనాడులో కూడా ఐటీ అభివృద్ధికి ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారాయన.
తెలంగాణ పర్యటన ముగిసిన అనంతరం తమిళనాడు ఐటీమంత్రి పీటీఆర్ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తెలంగాణ ఐటీరంగం అభివృద్ధిని అందులో ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శమైన విధానాలు ఇక్కడ అమలులో ఉన్నాయని చెప్పారు. ఐటీరంగంపై తెలంగాణ చూపిన ప్రత్యేక శ్రద్ధ, దాని ద్వారా అందిన ఫలాలు ఆదర్శనీయం, అనుసరణీయం అని అన్నారు. హైదరాబాద్ ని సందర్శించడం తనకెంతో సంతృప్తినిచ్చిందని చెప్పిన ఆయన, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.