నూతన ఆవిష్కర్తల స్వర్గం టీ వర్క్స్

అనేక మంది యువతీ, యువకులకు అనేక సృజనాత్మక ఆలోచనలున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టడానికి సరైన ఆర్ధిక పరిస్థితి లేక వారి ఆలోచనలు ఆచరణలోకి రావడం లేదు. అలాంటి వారి ఆలోచనలను ఆచరణలోకి తీసుకరావడానికి ఏర్పాటు చేసిందే టీ వర్క్స్. 'ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్ళండి' అనే నినాదంతో ఈ సంస్థను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తోంది.

Advertisement
Update:2023-03-02 09:04 IST

ఎలక్ట్రానిక్ , హార్డ్‌వేర్‌ రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అతిపెద్ద ప్రోటో టైపింగ్‌ సెంటర్ టీ వర్క్స్ ఈ రోజు ప్రారంభం కానున్నది. టీ-వర్క్స్‌ను గురువారం ప్రపంచ దిగ్గజ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ కంపెనీ చైర్మన్‌ యంగ్‌లూ ప్రారంభించనున్నారు.అనేక మంది యువతీ, యువకులకు అనేక సృజనాత్మక ఆలోచనలున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టడానికి సైరైన ఆర్ధిక పరిస్థితి లేక వారి ఆలోచనలు ఆచరణలోకి రావడం లేదు. అలాంటి వారి ఆలోచనలను ఆచరణలోకి తీసుకరావడానికి ఏర్పాటు చేసిందే టీ వర్క్స్. 'ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్ళండి' అనే నినాదంతో ఈ సంస్థను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తోంది.

అనేక మంది యువతీ, యువకులకు అనేక సృజనాత్మక ఆలోచనలున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టడానికి సరైన ఆర్ధిక పరిస్థితి లేక వారి ఆలోచనలు ఆచరణలోకి రావడం లేదు. అలాంటి వారి ఆలోచనలను ఆచరణలోకి తీసుకరావడానికి ఏర్పాటు చేసిందే టీ వర్క్స్. 'ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్ళండి' అనే నినాదంతో ఈ సంస్థను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తోంది.

వినూత్న ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడే పరికరాల నమూనాలను రూపొందించేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో 2016లో హైదరాబాదు బేగంపేటలో టీ వర్క్స్ ప్రారంభించారు. దాన్ని విస్తరించేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఒకేచోట ఉండేలా రాయదుర్గం పరిధిలోని ఐటీ కారిడార్ ప్రాంతంలో 2020లో ‘టీ వర్క్స్‌’ భవనానికి శంకుస్థాపన చేసింది.

సుమారు 4.92ఎకరాల స్థలంలో 350 కోట్ల రూపాయలతో 78వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ వర్క్స్ భవనాన్ని నిర్మించారు. 250 రకాల పరిశ్రమలకు అవసరమయ్యే అత్యాధునిక మౌలిక వసతులను వివిధరకాల ఉపకరణాలను ఇందులో అందుబాటులోకి తెచ్చారు.

యంత్ర తయారీకి అవసరమైన ఆధునిక పరికరాలు, ఎలక్ట్రానిక్స్‌ వర్క్‌ స్టేషన్లు, ఫినిష్‌ షాప్‌లు, లేజర్‌ కటింగ్, పీసీబీ ఫ్యాబ్రికేషన్, మెటల్‌ షాప్, వెల్డ్‌ షాప్, వుడ్‌ వర్కింగ్‌ వంటి అనేక వసతులు, వాటికి అవసరమయ్యే పరికరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. వివిధ రంగాల్లో కొత్త ప్రయోగాలు చేసే తయారీదారులు, ఆవిష్కర్తలతోపాటు ఇంజనీర్లు, డిజైనర్లు, సర్వీస్‌ ప్రొవైడర్లు, వలంటీర్లు, సంబంధిత రంగాలకు చెందిన వారు ప్రొటోటైప్‌ను అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యం వహిస్తారు.

తెలంగాణ ప్రభుత్వం దీన్ని దేశంలోనే అతి పెద్ద ప్రోటో టైప్‌ (నమూనా) సెంటర్‌గా తీర్చిదిద్దింది. ఇక్కడికి ఎవరైనా వినూత్న ఆలోచనతో వచ్చి ఒక పూర్తి స్థాయి ఉత్పత్తి నమూనాతో తిరిగి వెళ్లేలా.. అన్ని విధాలుగా సహకరించే యంత్రాంగంతో పాటు యంత్ర పరికరాలను ఉచితంగానే ఉపయోగించుకునే అవకాశం కల్పించనున్నారు.

ఇక్కడి యంత్రాలను గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆవిష్కర్తలతో పాటు కార్పొరేట్‌ ఎంగేజ్డ్‌ ఇన్‌ ప్రొడక్టు డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆర్‌అండ్‌డీ, ఎంఎస్‌ఎంఈ, హార్డ్‌వేర్‌ స్టార్టప్స్‌, విద్యార్థులు, ఆర్టిస్టులు, హబీయిస్టులు, ఆర్టిజన్స్‌ అండ్‌ క్రాప్ట్స్‌, అకాడమిక్స్‌, రీసెర్చర్స్ తదితరులు వినియోగించుకోవచ్చు.

ఈ రోజు రాయదుర్గం ఐటీ కారిడార్ ప్రాంతంలో ప్రారంభమవుతున్న టీ వర్క్స్ పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ''తెలంగాణకు ఇది గొప్ప రోజు. ఈ రోజు దేశంలోనే అతి పెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రం ప్రారంభించబడుతోంది.

ఉత్పత్తుల ఆవిష్కరణలో తెలంగాణను ప్రపంచ అగ్రగామిగా మార్చే దిశగా మరో మైలురాయిని చేరుకున్నాం'' అని కేటీఆర్ ట్విట్టర్ కామెంట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News