స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం: మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ప్రకటించిన‌ కేసీఆర్

ఈప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. దగ్గరుండి అన్ని చర్యలు చేపట్టాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు ముఖ్యమంత్రి సూచించారు.

Advertisement
Update:2023-03-17 12:32 IST

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించగా, పలువురికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన కేసీఆర్, మరణించిన వారి కుటుంబసభ్యులకు 5లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.

ఈప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. దగ్గరుండి అన్ని చర్యలు చేపట్టాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు ముఖ్యమంత్రి సూచించారు.

కాగా, స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో 12 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించగా, మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఎనిమిదో అంతస్తులో మొదలైన మంటలు 5,6,7 అంతస్తులకు కూడా వ్యాపించాయి. ఒక వైపు వర్షం పడుతున్నప్పటీ అగ్నికీలలు ఆగలేదు. ఫైర్ ను అదుపు చేయడానికి 15 అగ్నిమాపక శకటాలతో నాలుగు గంటల‌ పాటు శ్రమించాల్సి వచ్చింది.

Tags:    
Advertisement

Similar News