150 మందికి పైగా ఏఈవోలపై సస్పెన్షన్ వేటు!

రాష్ట్రంలో డిజిటల్ క్రాఫ్ సర్వే ను వ్యతిరేకిస్తున్న 150 మంది ఏఈవోలను ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది.

Advertisement
Update:2024-10-22 18:37 IST

తెలంగాణలో డిజిటల్ క్రాఫ్ సర్వే ను వ్యతిరేకిస్తున్న 150 మంది ఏఈవోలను ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. యూనియన్లు పెట్టినా, ప్రభుత్వం చెప్పిన పని చేయడానికి నిరాకరించిన వేటు తప్పదంటూ రాష్ట్ర సర్కార్ తన చర్యల ద్వారా హెచ్చరించింది. డిజిటల్ క్రాఫ్ సర్వే చేయకపోతే ఉద్యోగాలు ఉండవన్న తీరుగా ప్రభుత్వం చర్యలున్నాయని ఏఈవోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లపై ప్రభుత్వం వేధింపులను ఆపాలని, సస్పెన్షలను ఎత్తివేసి చర్చల ద్వారా తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏఈవోలు శంషాబాద్ లో సమావేశమై డిజిటల్ క్రాఫ్ సర్వే చేయబోమని, తగిన భద్రతను, సహాయకులను అందిస్తేనే అందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏఈవో లపై చర్యలకు ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది. అగ్రికల్చర్ సెక్టర్‌లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సృష్టించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రి మిషన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తొలి దశలో 12 రాష్ట్రాలను ఎంపిక చేశారు. అక్షాంశ, రేఖాంశాలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని ప్రతి భూమికి సంబంధించిన చిత్రాలను తీయడం, పంటల ఆన్‌లైన్ డేటాబేస్ తయారు చేయడం డిజిటల్ క్రాప్ సర్వే ముఖ్య ఉద్దేశం. తెలంగాణలో డిజిటల్ సర్వే నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఏఈఓలను ఆదేశించింది.

Tags:    
Advertisement

Similar News