సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
Advertisement
సమగ్ర శిక్షలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం నగరంలోని దిల్‌కుశ గెస్ట్‌హౌస్ లో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డితో కలిసి సమగ్ర శిక్ష ఉద్యోగులు కేంద్ర మంత్రిని కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. సమగ్ర శిక్ష పథకానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను కొనసాగించాలని, ఉద్యోగులకు బేసిక్ పే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అక్షరాస్యత పెంచేందుకు కృషి చేస్తున్న తాము చాలీచాలని జీతాలతో సతమతమవుతున్నామని తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ చారి తదితరులు ఉన్నారు.
Advertisement