కేటీఆర్ ను కలిసిన వండర్ బేబి ఉపాసన
చిన్నారి ప్రతిభ చూసి అబ్బురపడిన బీఆర్‌ఎస్ నేతలు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను వండర్ బేబి ఉపాసన కలిసింది. తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం నందినగర్ లోని నివాసానికి వచ్చిన ఉపాసన కేటీఆర్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన రెండున్నరేళ్ల ఉపాసన అద్భుతమైన జ్ఞాపకశక్తితో ప్రపంచ దేశాలు, వాటి రాజధానులు, ప్రఖ్యాత వ్యక్తులు, వారి ఫొటోలను గుర్తించి నోట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, సూపర్ టాలెంటెడ్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లతో ప్రశంసలు అందుకుంది. కేటీఆర్ ను కలిసిన సమయంలో కేసీఆర్ ఫొటోలతో కూడిన ఫజిల్ ను పూర్తి చేసింది. ఆమె ప్రతిభను చూసిన కేటీఆర్ నాయకులు అబ్బురపడ్డారు. చిన్నారి భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరాలని దీవించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.